కే జి బి వి గురుకుల పాఠశాల సిబ్బందికి వెంటనే పీఆర్సీని అమలు చేయాలి టీఎస్ యుటిఎఫ్ ఎర్రుపాలెం

Published: Thursday September 09, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లంచ్ అవర్ డెమో స్టేషన్ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండలం కేజీబీవీలో కేజీబీవీ సిబ్బందికి వెంటనే పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ అధ్యక్షులు నాగరాజు గారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండలం టీఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు మాట్లాడుతూ కేజీబీవీ గురుకుల పాఠశాల సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి ఇంతవరకూ అమలుకు నోచుకోలేదని వెంటనే వీరికి పిఆర్సిప్రకటించి టైం స్కేల్ ఇవ్వాలని కోరారు గతంలో పోరాటాల ఫలితంగా మరియు ఎమ్మెల్సీ నర్సారెడ్డి ప్రాతినిధ్యంతో సీయల్స్ పెంపుదల  సమ్మర్ వేతనం మెటర్నటీ లీవ్ తదితర సమస్యలు టీఎస్ యుటిఎఫ్ పోరాట ఫలితంగా వచ్చినవని వారు తెలియజేశారు అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ కేజీబీవీ లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు అలాగే కే జి బి సిబ్బంది కృష్ణవేణి విజయలక్ష్మి మాట్లాడుతూ మా సమస్యల పట్ల యూట్యూబ్ అండదండలుగా ఉందని యూట్యూబ్ ట్రిపుల్ లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సరితా గారు లిడియా జయంతి లక్ష్మి సులోచన నాగమణి జ్యోతి స్వరూప కోటేశ్వరమ్మ కుమారి ఇ తదితరులు పాల్గొన్నారు