తాత్కాలిక చెక్ పవర్ కొరకు వార్డు సభ్యుని ఎన్నిక

Published: Thursday August 26, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది ఆగస్టు (25) మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఉప సర్పంచ్ వడ్లకొండ నరసింహ రాజీనామా చేయడంతో బుధవారం గ్రామ పంచాయతీ సమావేశం సర్పంచ్ కొమురెల్లి రమా బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది గ్రామ పంచాయతీలో ఎనిమిది మంది వార్డు సభ్యులు ఓటింగ్ పాల్గొనగా మెజార్టీ సాధించిన  జక్క రాజేంద్రకుమార్ రెడ్డిని తాత్కాలిక చెక్ పవర్ గా. గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం జలంధర్ రెడ్డి సమక్షంలో ఎన్నుకోబడ్డారు ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఎడమ రాఘవేందర్ రెడ్డి చిట్యాల లింగస్వామి కొలిచెల్మి పద్మ తదితరులు పాల్గొన్నారు