అన్ని రంగాల అభివృద్ధి దిశగా రుణ సదుపాయం

Published: Thursday June 09, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
మంచిర్యాల బ్యూరో, జూన్ 8, ప్రజాపాలన :
 
 
జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ నిబంధనల మేరకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎఫ్.సి.ఎ. ఫంక్షన్హాల్లో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ హవేలిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాతాదారులు చేరువ కార్యక్రమంలో పాల్గొని బ్యాంకర్స్ స్టాల్స్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తూ స్వయం సహాయక సంఘాలకు, వ్యాపార అభివృద్ధికి వివిధ రకాలుగా రుణ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. వ్యాపార అభివృద్ధిపై దృష్టి సారించి రుణ సౌకర్యం పొందడం ద్వారా వివిధ రకాలైన యూనిట్లను నెలకొల్పి  ఉ త్పత్తుల ఉత్పాదకతను పెంపొందించు కోవాలని తెలిపారు. పి.ఎం.ఎస్.బి.వై. పథకం క్రింద సంవత్సరానికి 20 రూపాయలతో ప్రమాద భీమా 2 లక్షల రూపాయలు, పి.ఎం.జె.జె.బి.వై. పథకం క్రింద సంవత్సరానికి 436 రూపాయలతో 2 లక్షల ప్రమాద, సహజ మరణానికి భీమా అవకాశం ఉంటుందని, జిల్లాలోని ప్రజలందరు ఈ పథకాలతో పాటు ఎ.పి.వై., సామాజిక భద్రత పథకాలలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల బృందాలకు గత సంవత్సర లక్ష్యాలను 108 శాతంతో అధిగమించడం జరిగిందని తెలిపారు. బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామాలలో బి.సి.ఎస్. / సి.ఎస్.పి.ఎస్. సేవలు ఉంటాయని, తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం ద్వారా బ్యాంకుల ఎన్.పి.ఎ. తగ్గుదలతో మరింతగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు 15కోట్ల రూపాయల విలువ గల చెక్కులు, వ్యవసాయ, ఇతర రంగాలకు 8 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది బ్యాంక్ సిబ్బందికి అవార్డులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్.ఎం. చంద్రశేఖర్రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సాగర్రావు, మూర్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బి.ఎం. మహిపాల్, ఐ.సి.ఐ.సి.ఐ. మేనేజర్ రాజిరెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు