బోనకల్ బస్టాండ్ బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం కు వినతి పత్రం: మండల టిడిపి

Published: Thursday March 10, 2022
బోనకల్, మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో ఉన్న ఆర్.టి.సి.బస్టాండ్ కు బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బుధవారం మధిర డిపోకు విచ్చేసిన ఖమ్మం జిల్లా ఆర్.టి.సి. ఆర్.ఎం సులేమాన్ ను తెలుగుదేశం పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ తో కలిసి వినతిపత్రం అందజేశారు. వైరా జగ్గయ్యపేట బస్సులతో పాటు ఖమ్మం బస్సులు, బస్టాండ్ కు రాకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరియు ప్రస్తుతం మండల కేంద్రంలోని ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఖమ్మం బస్సులు బస్టాండ్ కు రావడం వలన ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. గతంలో ఖమ్మం నుండి వచ్చే బస్సులకు ద్వంసలాపురం వద్ద ఉన్న రైల్వే గేట్ వలన సమయం సరిపోక బస్టాండ్ కు బస్సులు రాలేదని కానీ ఇప్పుడు అక్కడ ఆర్.ఓ.బి నిర్మించడం వలన ఇప్పటికైనా బోనకల్ బస్టాండ్ కు బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధిర డిపో సర్వీస్ లను వైరా - జగ్గయ్యపేట కు నడపాలని ఈ సందర్భంగా ఆర్.ఎమ్ ను కోరడం జరిగినది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్ ఎం త్వరలో బోనకల్ బస్టాండ్ పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.