యువతకు ఉపాధి విషయంలో సిద్దిపేట మెరుగయ్యేదెప్పుడు?

Published: Thursday April 01, 2021
సిద్దిపేట, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : అభివృద్ధి అంటే నగరంలో పలు కట్టడాలు, పార్కులు నిర్మించడం,రోడ్లు వేయడంతో మాత్రమే అభివృద్ధి జరిగింది అంటే అది కల్లే. అభివృద్ధి అంటే నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ సుఖ శాంతులతో ఉంటేనే అదే నిజమైన అభివృద్ధి ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశానికి ఉన్న వరం యువత, ప్రపంచంలోనే యువత రం ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం అగ్రవరసలో ఉంటుంది. అటువంటి యువతకు ఉపాధి కరువై ఇంటిపట్టునే ఉంటే అప్పుడు ఆ ఇల్లు, సమాజం, నగరం అభివృద్ధి చెందిందని చెప్పడం అబద్ధమే అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. సిద్దిపేట నగరంలో కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సిద్దిపేటలో రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయి, అందమైన కట్టడాలు వెలిశాయి అందులో సందేహం లేదు కానీ నిరుద్యోగులకు ఉపాధి విషయంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అన్నది విమర్శకుల వాదన. అమాత్యా కొంచెం యువతకు ఉపాధి విషయంపై దృష్టి పెట్టండి అంటున్నారు ప్రజానీకం.