లేనిన్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర రేషన్ బియ్యం పట్టివేత

Published: Wednesday July 14, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : మీర్‌పేట్ పోలీస్ సిబ్బంది, ఎస్ వో టి ఎల్ బి నగర్ టీం మీర్‌పేట్ ఎస్ హెచ్ ఓ ఆదేశాల మేరకు లెనిన్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సమయంలో అంతలో రెండు ఆటోలు రావడంతో అనుమానం వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులు చెక్ చేయగా అందులో సుమారు 30 బ్యాగులు మొత్తం 13 కింటాలు బియ్యం ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని ఎక్కువ లాభార్జన కోసం బియ్యాన్ని అమ్ముతున్న వ్యక్తులు 1) సయ్యద్ అస్లాం, 2) అప్సర్ హుస్సేన్, 3) ఎండి ఇమ్రాన్ పై కేసు నమోదు చేసి వాహనం నెంబర్ (టీ ఎస్ 11, వై 3181) సీజ్ చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌పేట్ ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు...