మినీ స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు

Published: Monday June 14, 2021
జగిత్యాల, జూన్ 13 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని మిని స్టేడియంలో పట్టణ ప్రగతి నిధులైన 12 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మున్సిపల్ ఛైర్పర్సన్ డా. బోగ శ్రావణి ప్రవీణ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్ కౌన్సిలర్లు కుసరి అనిల్ పిట్టా ధర్మరాజు ముస్కు నారాయణ రెడ్డి డిఈ లచ్చిరెడ్డి వకర్స్ అసోసియేషన్ మెంబెర్స్ నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.