సేవాలాల్ మహారాజ్ సమితి ఆధ్వర్యలో సామూహిక అక్షరాభ్యాసం

Published: Thursday October 14, 2021
బోనకల్, అక్టోబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో స్థానిక గిరిజన తండా వారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు సేవలాల్ జెండా గద్దె వద్ద అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, 6వ రోజు అమ్మవారి సరస్వతి రూపం సందర్భంగా సేవాలాల్ మహారాజ్ సమితి సభ్యులు వినూత్నంగా ఆలోచించి దాదాపు 90 మంది చిన్నారులు, మహిళలతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరి మన్నలను పొంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే సంద్భంలో బీజేపీ యువనేత ఎన్నారై బీపీ నాయక్ మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17 కోట్ల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని తద్వారా ఒక తరం అంతా ఇబ్బంది పడే దుస్థితి ఉందని, మన జీవితాలు బాగు పడాలి అంటే చదువు తప్పనిసరి అని పిల్లల్ని చదివించాలి అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సేవలాల్ సమితి అధ్యక్షులు గుగులోత్ కిషోర్, ఉపాధ్యక్షులు రమేష్ నాయక్, కార్యదర్శి సైదులు, సభ్యులు సూర్య, గోపి, ఉపేంద్ర, సుమన్, వెంకట కృష్ణ, కార్తీక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.