తహాశీల్దార్, సర్పంచ్ ను అభినందించిన జడ్పీటీసీ ప్రమీల..

Published: Friday January 27, 2023
వైరా, జనవరి 26 (ప్రజాపాలన న్యూస్):
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ తహశీల్దారుగా గంటా శ్రీలతకు,  ఉత్తమ గ్రామపంచాయతీగా తెలగవరం సర్పంచ్ తేళ్ళూరి కృష్ణయ్యకు గురువారం ఖమ్మంలో కలెక్టర్ విపి గౌతమ్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను, అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో గణతంత్ర వేడుకలకు హాజరైన తల్లాడ జడ్పిటిసి దిరిశాల ప్రమీల వారిని అభినందించారు. కలెక్టరేట్ లో వారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ తల్లాడ మండలానికి ఉత్తమ అవార్డులు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, తెలగవరం గ్రామపంచాయతీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మువ్వా మురళీ, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ లు దిరిశాల దాసురావు, కేతినేని చలపతిరావు ఉన్నారు.*