బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

Published: Friday August 06, 2021
ఇబ్రహీంపట్నం ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా యువమోర్చా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ బాలవర్ధన్ రెడ్డి అధ్యక్షతన బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం, బీజేవైఎం రాష్ట్ర ప్రోటోకాల్ నెంబర్ కార్తీక్ గౌడ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం చౌరస్తా నుండి అనేక సుమారు రెండు వందల భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ నారాయణ సత్యనారాయణ మాట్లాడుతు హుజూర్న నగర్ లో పతకాలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. దన్నే బాషయ్య  మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు బూడిద  నరసింహారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు, బిజెపి మండల అధ్యక్షుడు దండం శ్రీశైలం హాజరయ్యారు. అనంతరం దండ శ్రీశైలం మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, తెలంగాణలో అనేక చోట్ల అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని, అందువల్ల వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. బూడిద నర్సింహారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ అభివృద్ధి చేయాలని, ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం అన్ని విధాలుగా వెనుకబడి ఉందని గత పదేళ్లలో ఏమీ అభివృద్ధి లేదని, ఏక్కడేసిన గొంగడి అక్కడే అన్నచందంగా  ఉందని ఆరోపించారు. బీజేవైఎం ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ చెప్పే కల్లబొల్లి మాటలు చెపితే నoమేదే లేదని, వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మాటలు చెప్పడం కాదని, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమార్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మారమని శేఖర్, మహేష్ చారి బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం, శ్రీకాంత్, బీజేవైఎం మండల మండల అధ్యక్షులు రాజు గౌడ్, యాచారం బీజేవైఎం అధ్యక్షులు నాగరాజు, తుర్కయంజాల్ బీజేవైఎం అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆదిభట్ల రాంప్రసాద్ రెడ్డి మరియు ప్రేమ్ సాయి, దేవేందర్, రమేష్, తులసి కుమార్, నితిన్, రాజు, తిప్పాయి గూడ సర్పంచ్ పాండు, జగన్, మారమొని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.