తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రారంభించిన అల్పాహారం మధిర మండలంలోని

Published: Thursday February 16, 2023
 తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రారంభించిన అల్పాహారం మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి చేతుల మీదుగా మార్చిలో పబ్లిక్ పరిక్షలు రాయనున్న 10వ తరగతి విద్యార్థులకు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయికృష్ణమా చార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి విద్యార్థులు అదనపు తరగతులు జరిగుతున్న సందర్బంగా వారికి సాయంత్రం అల్పాహారం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది పేద విద్యార్థులకు మంచి పోషక ఆహారంగా ఉపయోగపడుతుంది కావున విద్యార్థులందరు చదువుపై శ్రద్ద పెట్టి మంచి ఫలితాలు తీసుకొని రావాలని గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి కోరారు.
 టెన్త్ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకు ఈ అల్పాహారం ప్రతిరోజూ సాయంత్రం ప్రభుత్వం తెలిపిన మెనూ ప్రకారంగా విద్యార్థులకు అందిస్తామని హెచ్ఎమ్ సాయికృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాం, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, బాణోత్ బావ్ సింగ్, వేము రాములు, గుంటుపల్లి రమాదేవి,పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.