ఇతర దేశాలకు వెళ్ళే వారికి త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి.

Published: Monday June 07, 2021
తెలంగాన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి డిమాండ్.
మంచిర్యల జిల్లా ప్రతినిధి, జున్ 06, ప్రజాపాలన : గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్ళే వారికి త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్రా అదికార ప్రతినిది రాజుగౌడ్ ఎరుకల కోరారు. ఈమేరకు  ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎవరయితే విదేశాల నుండి సెలవుల్లో తమ స్వంత రాష్ట్రాలకు చేరుకున్నారో వారీ ఉద్యోగరీత్యా తిరుగు ప్రయాణం చేయాలి అనుకునే వారికీ, కొత్త వీసాలపైన విదేశాలకి వెళ్ళే వారికీ రెండు డోసుల టీకా తీసుకున్నా వారికే కోన్ని దేశాల్లోకీ అనుమతి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈలాంటి సందర్భంలో రేండు డోసుల వ్యాక్సిన్ వేసుకోకుండా ఆలస్యం కావడంతో విజాలు రద్దు అవుతున్నాయని తెలిపారు. దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసిన ఉధ్యోగులకు, కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. యూరోప్ దేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి డబ్ల్యు హెచ్ఒ అనుమతి పొందిన వ్యాక్సిన్లను తీసుకున్నవారికే తమ దేశంలోకీ అనుమతి ఇస్తున్నందున విదేశాలకు ఉద్యోగరీత్యా, విద్యాభ్యాసం సందర్శకులకు వెళ్ళాలి అనుకునే వారికి చాల ఇబ్బందులు ఎదురు కోవలసిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పరిస్థితిని అర్థం చేసుకోని యుద్ధ ప్రాతపదికన ఈ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని లేని పక్షంలో విదేశాల్లో తమా విద్య ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ శాఖ ఇంచార్జీ మహమ్మద్ అలీమ్, పోన్కల్ జన్నారం గౌరవ అధ్యక్షులు రమేష్ గౌడ్, అధ్యక్షుడు మెరుగు సత్యగౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దుమళ్ళఎల్లయ్య (రెడ్డి), వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లపెల్లి రాజేశ్, బొంతల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఖదర్ ఖాన్, రాగుల సంపత్, ఎరుకల ఆంజగౌడ్ ప్రధాన కార్యద్శులు అహ్మద్ పాష ఖదీర్, కట్లకుంట గంగన్న ప్రచార కార్యదర్శులు కలీమ్, నల్లురి లక్ష్మణ్, మహమ్మద్ సమీర్, చందూ మణికంఠ, హబీబ్, జనుగురి లక్ష్మణ్, ఉప్పు వేణు, దుమల్ల పోషం వావిలాల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.