ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమం

Published: Wednesday August 03, 2022

కోరుట్ల, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్టలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్  ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటుగా మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్,పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, రైతు సమితి జిల్లా అధ్యక్షులు చీటీ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ అయాజ్ , ఎంపీపీ తోట నారాయణ,  వైస్ ఎంపీపీ చీటీ స్వరూప,జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ మరియు ఇతర కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.