తెరాస పార్టీ సభ్యత్వనమోదు

Published: Wednesday February 17, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): జగిత్యాల నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో తెరాస కార్యకర్తలకు  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్ జడ్పీటీసీ సంగెపు మహేష్ గట్టు సతీష్ బలముకుందాం డా. చంద్రశేఖర్ గౌడ్ ముస్కు ఎల్లారెడ్డి గోలి శ్రీనివాస్ నక్క రవీందర్ తెరాస  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.