పెండింగ్ లో ఉన్న క్రీడా ప్రాంగణం, నర్సరీలను శరవేగంగా చేపట్టాలి. మేరుగు విద్యాచందన ..

Published: Friday November 04, 2022
పెండింగ్ లో ఉన్న క్రీడా ప్రాంగణం, నర్సరీలను శరవేగంగా చేపట్టాలి. మేరుగు విద్యాచందన ..
 
 
పాలేరు నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాల వలన పెండింగ్ లో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలను శర వేగంగా పూర్తి చేయాలని జిల్లా
 
గ్రామీణ అభివృద్ధి అధికారి మేరుగు విద్యాచందన ఆదేశించారు. మండలం లోని సదాశివాపురం, ముజ్జుగూడెం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను, నర్సరీలను పరిశీలించారు. రెవిన్యూ శాఖ అప్పగించిన స్థలాలను పరిశీలించారు. వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిన వాటిపై మండల అధికారులతో చర్చించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం సూచించన మేరకు టీకేపీ లు, నర్సీలను ఏర్పాట్లు చేసేందుకు.. కృషి చేస్తున్నట్లు తెలిపారు. నర్సీరీల పట్ల అప్రమతంగా ఉండాలని -సూచించారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ
 
క్రీడా ప్రాంగణాల లక్ష్యం ను నేరవేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శివ, ఈజీఎస్ ఏపీవో సునీత, సర్పంచ్లు యాతాకుల లక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, ఈజీఎస్ ఈ.సీ. శేషగిరి. పంచాయతీ కార్యదర్శి రవి, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.