దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

Published: Tuesday September 27, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 26 ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో  వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంచిర్యాల్ జిల్లా తాండూర్ మండలానికి చెందిన ముగ్గురూ A1, బండి నీలేష్, A2 దూల రాజేశం, A3 దూల నవీన్, వీరు ముగ్గురు మిత్రులు గత కొన్ని నెలల నుండి పలు బంగారు, కిరాణం దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు.సోమవారం ఉదయం వాంకిడి ఎస్ఐ సిబ్బందితో కలిసి లంజన్ వీరా చౌరస్తా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా 3 నిందితులు బుల్లెట్ వాహనంలో హెల్మెట్ ధరించి గడ్డపారతో వెళ్తూ అనుమానంతో విచారించగా తమ నేరాల తిట్టాను చెప్పారు. ఏ వన్ గత కొంత కాలం క్రితం రెబ్బెన గ్రామంలో బైక్ మెకానిక్ పని చేస్తుండే వాడిని, వచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోవడం లేదని, ముగ్గురం కలిసి రాత్రిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లలో, షాపులలో  దొంగతనం చేసి వచ్చిన డబ్బులను ముగ్గురం పంచుకునే వారమని చెప్పారు. మొత్తం 12 కేసులలో 12 తులాల 38 గ్రాముల బంగారం, 5 కేజీల 61 గ్రాముల వెండి, నగదు రూ 8500 రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగలను పట్టుకుని కేసును ఛేదించిన ఆసిఫాబాద్ డిఎస్పీ శ్రీనివాస్, వాంకిడి సిఐ శ్రీనివాస్, ఎస్సై దీకొండ రమేష్,పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి వారికి క్యాష్ రికాల్డ్ అందజేశారు. ప్రతి దుకాణాలు, ఇంటి యజమానులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని అన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించారని పేర్కొన్నారు.
 
 
 
A