అలిశెట్టి రచనలు అక్షర కర దీపికలు : ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Wednesday January 12, 2022

జగిత్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ అక్షర సూరీడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ రచనలు అక్షర కర దీపికలని, ఆయన సాహిత్యం సమాజ చైతన్యాన్ని కోరింది అని శాసన సభ్యులు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధినేత గుండేటి రాజు, జిల్లా గ్రంధాలయం అద్వర్యంలో స్థానిక జిల్లా గ్రంధాలయంలో నిర్వహించిన స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి, రెండు నిమిషాలు మౌనం వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్  మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యలక్ష్మి కోరిక మేరకు జగత్యాలలోని ఉండడానికి నివాసం ఏర్పాట్లు ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకువెళుతానని తెలియజేశారు. కలిసి ప్రతి యేడు ప్రకటిస్తున్న రాష్ట్ర స్థాయి అలిశెట్టి స్మారక సాహితీ పురస్కారాలను 2022 సంవత్సరం గాను గోదావరి ఖని కి చెందిన ప్రముఖ కవయిత్రి గౌరోజు అనూశ్రీ, హన్మకొండ కు చెందిన కవయిత్రి తిరునగరి వకుళ వాసు, జగిత్యాల జిల్లా తుంగురుకు చెందిన డాక్టర్ గండ్ర మహేష్, మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి దాసరి శ్రీనాథ్ గౌడ్ ను ఘనంగా ఎమ్మెల్యే సన్మానించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యలక్షి, కుమారుడు సంగ్రామ్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అలిశెట్టి రాజు, కవయిత్రి వంగ గీతారెడ్డి, అయిత అనిత, ఓదెల గంగాధర్ పాత్రికేయులు టి.వి. సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, వుజగిరి జమున, బోనగిరి దేవయ్య,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్ల ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్ కుమార్, పంబల రామ్ కుమార్, నాయకులు ముఖేష్ ఖన్నా, జగన్, డుమల రాజ్ కుమార్, ఆరిఫ్, డాక్టర్ శ్యామ్ సుందర్, మాడిశెట్టి శ్రీనివాస్, కల్లపెళ్లి సరళ, ముత్యం భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.