ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *ఉద్యోగాలు సాధించేదాకా యువతకు అండగా ఎంకేఆర్

Published: Wednesday November 30, 2022


   ఉద్యోగాలు సాధించేవరకు యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని ఫౌండేషన్ అధినేత ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అన్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న శారీరక శిక్షణా శిబిరాన్ని ఎమ్మెల్యే  సందర్శించారు.
అభ్యర్థులకు ట్రాక్ సూట్లు, డ్రెస్ మెటీరియల్స్ ఆయన అందజేశారు, అభ్యర్థులకు అందిస్తున్న పాలు, గుడ్లు, పండ్లు, బిస్కెట్లను పరిశీలించారు. వసతులపై అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఏసిపి ఉమామహేశ్వరరావు,  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, సీఐ రామకృష్ణ, ఎంపీపీ కృపేష్, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య, ఫౌండేషన్ కార్యదర్శి జేర్లోని రాజు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.