బిజెపి వల్లే పేపర్ లీకేజీ

Published: Thursday April 06, 2023
సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి: 
బిజెపి వల్లే రాష్ట్రంలో పేపర్ లీకేజీ జరిగిందని యంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కంది మండల కేంద్రంలో బీఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని, ఓడిపోయినా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న నాయకుడు చింతా ప్రభాకర్.... ను ఎమ్మెల్యే ను చేసుకోవాలని సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.  స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నేతలు చెలాగాటమాడుతున్నారని  విమర్శించారు. బీజేపీ నాయకులు చేసే కుల్లు కుతంత్రాలకు ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని తెలిపారు. బీఆర్ యస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ కార్యకర్తల ద్వారా పేపర్ లీకేజీ చేయడం దారుణం అన్నారు. టి యస్ పి యస్ సి, 10 వ తరగతి పేపర్ లీక్ చేయడం దారుణమని వీటన్నిటికీ బీజేపీ నాయకులు కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు బీజేపీ చేస్తున్నదని, తెలంగాణ ప్రజలు ఆలోచించు కోవాలన్నారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎమ్ఐడిసి చైర్మైన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి , డీసీసీబీ వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు కొండల్ రెడ్డి, రాంరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.