ఏరోనాటిక్స్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కర్నాటి కావ్య

Published: Tuesday May 17, 2022
 ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ అవార్డ్ ప్రధానోత్సవం
 
బోనకల్, మే 16 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణాతో పాటు ఖమ్మం జిల్లా బోనకల్ మండల కీర్తిని యూనివర్శిటీ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపిన తెలుగుతేజం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కలకోట సహకార సంఘం అధ్యక్షులు కర్నాటి రామ కోటేశ్వరరావు కుమార్తె కర్నాటి కావ్య అమెరికాలోనీ ఫ్లోరిడాలో గల ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏరోనాటిక్స్ విభాగంలో విద్యను అభ్యసిస్తున్నది.మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏరోనాటిక్స్ విభాగంలో కావ్య యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించింది.యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించిన కావ్యకు ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పరిశోధకులు చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం చేస్తూ కావ్యకు యూనివర్శిటీలో గల డిస్ ప్లే పై శుభాకాంక్షలు తెలిపుతు అభినందించారు.