బుగ్గ రామేశ్వరంలో ఇకో టూరిజానికి అనుకూలం

Published: Monday February 13, 2023
* అనంతగిరి ఊటీగా ప్రసిద్ధి
* భారతదేశంలోనే రెండవ ప్రసిద్ధ శ్రీ అనంతనాభ స్వామి దేవాలయం
* సముద్ర మట్టానికి1168 మీటర్ల ఎత్తులో అనంతగిరి కొండలు
* అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
వికారాబాద్ బ్యూరో 12 ఫిబ్రవరి ప్రజాపాలన : అనంతగిరి కొండలు హైదరాబాదుకు 70 కిలోమీటర్లు వికారాబాద్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో రెండే రెండు ప్రాశస్త్యమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి త్రివేండ్రంలో రెండవది వికారాబాద్ లో ఉన్నవి. శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఇకో టూరిజం గురించి శాసన సభ అధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా సంబంధిత మంత్రి దృష్టికి తెచ్చిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వేద కాలము నుండి శ్రీ అనంతపద్మనాభ దేవాలయం ఉన్నది. విష్ణు పురాణంలో కూడా ఈ గుడి ప్రాశస్త్యం వివరించబడినది. అనంతగిరి ప్రాంతంలో మార్కండేయ మహర్షి తపస్సు చేశాడు. గుహలు కూడా పర్యాటకులకు కనిపిస్తాయి. అనంతగిరి దేవాలయంలో రెండు జాతరలు జరుగుతాయి. ఒకటి చిన్న జాతర, రెండవది కార్తీక మాసంలో జరిగే పెద్ద జాతర. జాతరలను చూసి తరించడానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అనంత పద్మనాభ స్వామి పేరు మీదనే అనంతగిరి కొండలుగా పిలవబడతాయి. శేషాచల అడవుల కృష్ణ భాగంగా చివరి భాగంగా అనంతగిరి కొండలను పేర్కొంటారు. హైదరాబాదులో పిలుస్తున్న మూసీ నది అనంతగిరి కొండల్లోనే పుట్టింది. అనంతగిరి కొండల్లో మంచి పిక్నిక్ స్పాటుగా ఏర్పాటు చేయవచ్చు. గతంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలతో కలిసి అనంతగిరి అభివృద్ధికి ఏమేమి చేయాలో పరిశీలించి ఆలోచించాం. అనంతగిరి కొండల చుట్టుపక్కల కోటపల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి ప్రాజెక్టు లలో బోటింగ్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవే కాకుండా బుగ్గ రామేశ్వరం ఆలయం సమీపంలో భూమిలో నుండి నీరు పైకి ఉబికి వస్తుంది. జల ధారలా నంది నోటిలో నుండి జీవనదిలా దుంకుతుంది. బుగ్గ రామేశ్వర ఆలయానికి 50, 60 ఎకరాల భూమిని అప్పగిస్తే మంచిగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కళం. ఇక్కడ ఇకో టూరిజాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తే బెంగళూరులో ఉన్న జిందాల్ కు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉండదు. ఇకో టూరిజాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ? ఏమేమి వసతులు కల్పిస్తారని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. వీలైనంత తొందరగా ఇకో టూరిజాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ అనంతగిరి కొండల నుండి త్రివేండ్రం వరకు సొరంగం ఉన్నదని చరిత్ర చెబుతుందన్నారు. దానికి ఆనుకొని 200 ఎకరాల భూమి కూడా ఉన్నది. దాన్ని ఖచ్చితంగా టూరిజం చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని విషయంలో గతంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ నాతో కలిసి చర్చించారు.