మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఐకానిక్ ఉమెన్ 2020 అవార్డ్స్ ప్రదానం

Published: Tuesday March 09, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : మహిళలు అన్ని రంగాలలో రాణించాలి అని స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఉద్యోగాలలో చదువులలో ముందున్నారని మహిళలను గౌరవించే విధంగా తల్లిదండ్రులు స్కూలు టీచర్లు విద్యార్థులకు విద్యాబోధన అందించాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు 80% శాతం మార్పు చెందారని మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చాలి అని అడిషనల్ డీసీపీ లావణ్య అన్నారు. మెడికవర్ ఉమన్  చైల్డ్ హాస్పిటల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ యాజమానులు మహిళా దినోత్సవం సందర్భంగా ఐకానిక్ ఉమెన్ 2020 అవార్డును సుమారు 56 మంది మహిళలు వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు, వైద్యులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పరోపకారిలన వీరు సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ లావణ్య, రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం చాల సంతోషంగా ఉన్నది. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిల్లలని తల్లిదండ్రులు క్రమశిక్షణగా పెంచాలని స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదన్న విషయాన్ని గమనించాలని మహిళలు వంటగదికి పరిమితమని కాకుండా ప్రతి ఒక్క రంగాలలో ముందున్నారని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి నీ గుర్తించి అభినందించి నందుకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది, అవార్డ్స్ గెలిచిన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.