అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి : అఖిలపక్షం డిమాం

Published: Monday May 31, 2021

బెల్లంపల్లి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపెల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సింగరేణి స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న గృహాలకు, అసలే నిర్మాణాలు లేకుండా ప్రహరి గోడ కట్టిన స్థలాలకు ఇంటి నెంబర్లను కేటాయిస్తున్న మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని బెల్లంపల్లి పట్టణ అఖిలపక్షం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఆదివారం నాడు  ప్రకటన విడుదల చేస్థూ బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కోర్టు పరిధిలో ఉన్న స్థలాలలో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నవారికి అసలే ఇల్లు లేకుండా ప్రహరి గోడలున్న ఖాళీ స్థలాలకు కూడా ఇంటి నెంబర్లు కేటాయిస్తూ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ, కోర్టు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారన్నారు, బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నఈ సమయంలో స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్  ముందు ఉన్న  12 ఎకరాల ప్రభుత్వ భూమిని  కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కొంతమంది కౌన్సిలర్సు తన అనుచరులతో కలిసి కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ కోర్టు ఆర్డర్ కు విరుద్ధంగా గతంలో ఇచ్చిన 430 ఇంటి నెంబర్లకు తోడు 26 వ వార్డు పరిధిలో ఉన్న స్థలంలో మరో 40మంది దరఖాస్తు చేసుకున్నారని ఇవన్నీ వివాదాస్పదంగా కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు అని తెలిసినా స్థానిక మున్సిపల్ అధికారులు లంచాలకు ఆశపడి అక్రమంగా ఇంటి నెంబర్లు ఇస్తున్నారని వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి భూకబ్జాదారులపై పీడీ యాక్టు నమోదు చేసి ఆక్రమనదారులనుండి భూమిని స్వాధీనం చేసుకొని మెడికల్ కళాశాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జే ఏ సి ప్రధాన కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం జై జేఏసీ ప్రింట్ అండ్ మీడియా ప్రచార కార్యదర్శి యాదవ్, జేఏసి ఉపాధ్యక్షులు కాశీ సతీష్ కుమార్, అమానుల్లాఖాన్, ఎం డి గౌస్, జే ఏ సి కార్యదర్శి ఆడెపు మహేష్, తదితరులు పాల్గొన్నారు.