అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే...

Published: Friday June 11, 2021
సారంగాపూర్, జూన్ 10, (ప్రజాపాలన ప్రతినిధి) : సారాంగాపూర్ మండల్ రేచపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులైన 15 లక్షలతో 3 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం సారంగాపూర్ మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 2లక్షల 70వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమున శ్రీనివాస్ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నరసింహరెడ్డి ఎంపీటీసీ బుక్య లావణ్యగంగాధర్ సర్పంచులు జయ లక్ష్మారెడ్డి పల్లపు వెంకటేష్ బెక్కెం జమునశ్రీనివాస్ ఉపసర్పంచ్ రాజేశం రమేష్ మాజీ ఎంపీటీసీ జగన్ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.