పెంచిన ఇంజనీరింగ్ కళాశాలలా ఫీజులు తగ్గించాలి - పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజేష్ డిమా

Published: Tuesday December 13, 2022

చేవెళ్ల డిసెంబర్ 12 (ప్రజాపాలన):-

రాష్ట్రంలో పెంచిన ఇంజనీరింగ్ కళాశాలలా ఫీజులు వెంటనే తగ్గించాలి. మరియు అధిక ఫీజులు తీసుకుంటున్న శ్రీ చైతన్య, నారాయణ  కళాశాలలా పై చర్యలు తీసుకొని వాటి గుర్తింపు రద్దు చేయాలి  పిడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యుడు  రాజేష్ అన్నారు.
అలాగే ఇంజనీరింగ్ లా, కళాశాలలా ఫీజులు కూడా తగ్గించాలని అన్నారు. అదేవిదంగా పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు  మేస్ చార్జీలు పెంచాలి పెండింగ్ లో ఉన్నటువంటి 33.56 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి అని, హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయలన్నారు. వేల మంది పేద విద్యార్థులు చదువుకుంటున్న *వికారాబాద్ జిల్లాలో సంక్షేమ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి* అని ఉమెన్స్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అధికంగా  గదులను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలి అని అన్నారు.
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చేసారు.