మృత్యువాత పడ్డ గొర్రెలు... పూర్తిగా నష్టపోయామన్న లబ్ధిదారులు

Published: Tuesday August 03, 2021
ఇబ్రహింపట్నం, ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో మంచాల మండలం చిదేడ్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 _21 సంవత్సరంలో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లో భాగంగా సుమారు 30 వేల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖాతా కు ప్రతి ఒక్క లబ్ధిదారుడు డిడి రూపంలో జమచేయగా, దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత గత నెల  జూలై 22 వ తేదీన 29 మంది లబ్ధిదారులకు 29 యూనిట్ల గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయంలో గొర్రెల కాపరులు లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు అసలు వృద్ధి చెందవని, అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, అన్ని గొర్రెలు ఆరోగ్యంగా లేవని, అనారోగ్యంతో బాధ పడుతున్న గొర్రెలకు పంపిణీ చేసి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఆవేధన చెందారు. అయితే దాదాపు పది రోజుల వ్యవధిలో చాలా గొర్రెలు చనిపోయాయి. ఈ గొర్రెల పెంపకంమే జీవనోపాధిగా బతుకుతున్న మేము, ఈ రకంగా గొర్రెలు చనిపోవడం వల్ల ఆర్థికంగా పూర్తిగా నష్టాలపాలు అయ్యి చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని లబ్ధిదారులు విలేకరులతో అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీటి స్థానంలో పూర్తి ఆరోగ్యవంతమైన వేరొక గోరెలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుడు గుణుకుల శ్రీనివాస్ మాట్లాడుతూ" ప్రభుత్వం  తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి, కనీసం ఆ డబ్బులకు లబ్ధి చేకూరేలా కూడా గొర్రెలు ఇవ్వలేదని, పూర్తిగా అనారోగ్యం బారిన పడిన గొర్రెలు ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన గొర్రెల స్థానంలో ఆరోగ్యవంతమైన, పెద్దావిగా ఉన్న వేరొక గొర్రెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పశువైద్యాధికారి యైన నాగమణి ని సంప్రదించగా ఆమె మాట్లాడుతూ "గొర్రెల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదని, లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ జరిగిన రోజులలో వర్షకాలం కారణంగా భారీ వర్షాలు కురుసాయని అందువల్ల గొర్రెలకు ఎలాంటి అనారోగ్యం చెందకుండా మందులు కూడా గొర్రెల కాపరులకు (లబ్ధిదారులు) ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చనిపోయిన గొర్రెల స్థానంలో వేరొక నాణ్యమైన గొర్రెలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రతి ఒక్క గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు గుణుకుల తిరుమల్లేష్, చదువోణీ రాజు, పార్వతమ్మ, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.