ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారి డాక్టర్ రాంబాబు

Published: Thursday October 20, 2022

బోనకల్, అక్టోబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో అన్ని పోగ్రాములపై సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తో సమావేశం నిర్వహించి గర్భిణీ స్త్రీల నమోదు ప్రక్రియ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కువగా కాన్పులు అయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అక్టోబర్ 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు జరిగే బోదకాలు ,ఫైలేరియా నివారణ చర్యల కార్యక్రమంలో భాగంగా రెండు సంవత్సరాల పైబడిన వారికి మూడు రకాల మందులను అందజేయాలని, ఈ మందులను వయసులవారీగా టిఫిన్ లేదా భోజనం తర్వాత వేసుకునేటట్లు తెలియపరచాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, వాలంటీర్స్ లను నియమించి ఇంటింటికి వెళ్లి మందులు వేయించి డోర్లు పై మార్కింగ్ చేయించాలని అన్నారు. కనుక స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్లు, సి హెచ్ ఓ పి శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, పి రాజ్యలక్ష్మి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.