ఆయుధ పూజ చేసిన ఆస్పత్రి సిబ్బంది

Published: Thursday October 06, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి:
 
విజయదశమి, దసరా పండుగ సందర్భంగా, ప్రతి సంవత్సరం జరిపే ఆయుధ పూజా కార్యక్రమాన్ని బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ లో  డి వై సీ ఎం ఓ, డాక్టర్ రామాల శౌరి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా  నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ లోని శస్త్ర చికిత్సకు  ఉపయోగించే బాయిల్స్ ఆపరేటర్స్, సి ఆమ్స్ యంత్రాన్ని, వివిద పరికరాలను సీనియర్ వార్డు అసిస్టెంట్ శ్రీధర్ దంపతులు శష్ర చికిత్సలు చేసే పరికరాలతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళి, ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ అనుముల సత్యనారాయణ, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శులు, దండ బోయిన  భాస్కర్, రసరంజని,మాట్రన్ విజయలక్ష్మి, అసిస్టెంట్  మాట్రన్ దాసరి అరుణ సుందరి, నర్సింగ్ సిబ్బంది, వార్డ్ అసిస్టెంట్లు, జనరల్ కార్మికులు, ఎలక్ట్రీషియన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.