రోటరీ డిస్ట్రిక్ట్ అవార్డు నైట్ 2021

Published: Tuesday November 02, 2021
హైదరాబాద్ అక్టోబర్ 31 ప్రజాపాలన ప్రతినిధి : అసాధారణ ప్రతిభకు గాను రోటరీ డిస్ట్రిక్ట్ అవార్డు నైట్ 2021 పేరున రోటేరియన్ సేవలను గుర్తించి జిల్లాల వారిగా పలువురికి అవార్డులను అందజేశారు. హైదరాబాద్ సుచిత్ర సెంటర్ (మెట్రో మాల్) జీడిమెట్లలోని ఎల్.వి. గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నాడు రాత్రి పురస్కారాలు అందజేశారు. భువనగిరి రోటేరియన్ క్లబ్ చైర్మన్ డాక్టర్.ఎంపల్ల బుచ్చిరెడ్డి, న్యూ క్లబ్స్ తెలంగాణ రీజియన్ కమ్యూనిటి, ఎకనామిక్ తెలంగాణ   రీజియన్ చైర్మన్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తదితరులు అసాధారణ ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. రోటేరియన్ అసాధారణ ప్రతిభ పురస్కారం అందుకున్న గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి చిన్నతనం నుండి కూడా సేవాభావంతో అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని భవిష్యత్ లో అనేక పురస్కారాలు అందుకోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉచిత సేవా కార్యక్రమాలు చేపడుతున్న తాల్క ట్రస్టు (భరత్ కుమార్ మెమోరియల్ మాటూరు) సభ్యులు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షుడు ఎంపల్ల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ వంగేటి సూర్య ప్రకాష్ రెడ్డి మరియు పలువురు రొటేరియన్స్ శుభాకాంక్షలు అందజేశారు.