యూసుఫ్ గూడ లో మ్యాక్స్ ఎయిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మాగం

Published: Monday November 14, 2022
యూసుఫ్ గూడ లో మ్యాక్స్ ఎయిడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను  ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, కో-ఆపరేట్ మార్కెటింగ్
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే 
మాగంటి గోపినాథ్ లు ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 
కరోనా తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ఆసుపత్రుల అవసరం చాలా
పెరిగిందన్నారు. అటువంటి ఆసుపత్రిని తన చేతుల 
మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా
ఉందని అభిప్రాయపడ్డారు.
అన్ని సదుపాయాలతో, అనువైన ప్రదేశంలో అందరికీ అందుబాటులో ఉండే ఇటువంటి ఆసుప్రతిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు.
వైద్యరంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్య బృందం, అత్యాధునిక
టెక్నాలజితో, అందరికీ అందుబాటు ధరలలో, అన్ని వసతులు కార్పోరేట్ స్థాయిలో ఒకే
చోట ఉండే విధంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఐ.సి.యు, ఎమర్జెన్సీ &
ట్రామా కేర్, సిటి స్కాన్ 24 గంటలు పనిచేస్తూ ఉండటం తమ ప్రత్యేకతగా నిలుస్తుందని వైద్యశాల
ఎం.డి. సంపత్ కుమార్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్స్
సాహస్ కుమార్, డాక్టర్లు అమ్రిశ్ రాం రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సుధీర్,  మహేందర్,  వంశీ, శ్వేత,  గోపి, షాజహాన్ లతో పాటు ఆసుపత్రి 
సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.