నేటితో ఉచిత శిక్షణకు దరఖాస్తుకు చివరి అవకాశం.. ప్రాజెక్టు ఆఫీసర్ సైదులు వెల్లడి..

Published: Tuesday February 28, 2023
ఖమ్మం, ఫిబ్రవరి 27 (ప్రజా పాలన న్యూస్):
 *తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్శస్ వారు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్సుల్లో ఉచిత శిక్షణకు ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ సైదులు సూచించారు. సోమవారం ఖమ్మంలోని ట్రైనింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిరుద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఇతర వివరాలకు 9502740360, 9391463834 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కో ఆర్డినేటర్ దాసరి కృష్ణ, జే.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.*