హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

Published: Wednesday March 08, 2023
* జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 07 మార్చి ప్రజాపాలన :  హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ కుటుంబ సభ్యులతో పాటు జిల్లా అధికారులతో కలిసి రంగులు పూసుకొని హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు.  జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, జిల్లా గణాంక శాఖ అధికారి నిరంజన్ రావు కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బందితో కలసి హోలీ పండుగను ఆనందోత్సవాలతో  ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.