తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లు నియామకం.

Published: Wednesday August 18, 2021
మధిర, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీసూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా జవ్వాజి ఆనందరావు  నియామకం.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు నియమిస్తూ అభ్యర్థుల ఎంపికను విడుదల చేశారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, రేణుకా చౌదరి అనుచరులు జవ్వాజి ఆనందరావు ని సూర్యపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జవ్వాజి ఆనందరావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి మా నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా పని చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.