బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంపిపి

Published: Tuesday October 05, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 04, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా తెలంగాణ ఆడపడుచుల కోసం పంపిణీ చేస్తున్న బతుకమ్మ పండుగ కానుక చీరలను దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ సోమవారం స్థానిక మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదల కొరకు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఆడబిడ్డ మోహంలో చిరునవ్వును చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష  అని, రూ.333 కోట్లు ఖర్చు చేసి ఈ సారి ప్రత్యేకంగా 30 రంగులు, 20 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డలకు చేనేత చీరలను పంపిణీ చేయనున్నట్లు అన్నారు. హార్హులైన ప్రతి ఒక్కరూ బతుకమ్మ చీరలను తీసుకొని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవాలని కోరారు. ముందస్తుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.