బోనకల్ మండల కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ లు నిర్మించాలి:న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ

Published: Friday October 01, 2021
బోనకల్సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో మూత్రశాలలు మరుగుదొడ్లు స్నానాల గదులు నిర్మించాలని న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గరిడేపల్లి సత్యనారాయణ అన్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు ఖమ్మం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనకల్ మండలం లో 23 గ్రామాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు నిత్యం తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, ఎం ఈ ఓ ఆఫీస్, వ్యవసాయ అధికారి కార్యాలయం వ్యవసాయ పనులుతో పాటుగా వివిధ పనుల నిమిత్తం బోనకల్ మండల కేంద్రానికి నిత్యం వందలాది వేలాది మంది ప్రజలు వస్తుంటారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి మూత్ర శాలలు మరుగుదొడ్లు స్నానపు గదులు నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోకి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ల దూరం అని ఆయన అన్నారు. కావున నిత్యం రద్దీగా ఉండే బోనకల్ మండల కేంద్రంలో ఖమ్మం బస్టాండ్ వద్ద, బోస్ బొమ్మ సెంటర్లో సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఇది మహిళలకు వృద్ధులకు పిల్లలకు ఆత్మగౌరవ సమస్య అని ఆయన తెలిపారు. కావున ప్రభుత్వం తగు విధంగా పరిశీలించి బోనకల్ మండల కేంద్రంలో తక్షణమే సులభ కాంప్లెక్స్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాలని ఆయన కోరారు.