రైతులు పాడి పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించాలి. సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ

Published: Thursday September 08, 2022
పాలేరు సెప్టెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
రైతులు పాడి పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించాలని సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ సూచించారు. మండలం లోని కొత్తకొత్తూరు గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోపాలమిత్ర నిర్వహించిన పశువైద్య శిభిరం విజయవంతమైంది. ఈ శిభిరం ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు...రైతులు ఈ శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేలు రకమైన పశు యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. రైతులు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలమిత్రలు క్షేత్ర స్థాయిలో శిభిరాలు
నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 44 పశువులకు గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. 15 పశువులకు సాధారణ వైద్య పరీక్షలు, 46 లేగదూడలకు నట్టల నివారణ మందును త్రాగించారు. ఈ కార్యక్రమంలో డాల్డా అధికారి కిషోర్, గోపాలమిత్ర సూపర్వైజర్ శంకరయ్య, గోపాలమిత్రలు ఆంజనేయులు, వి.నరేష్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area