సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. తల్లాడ సర్పంచ్ సంధ్యారాణి..

Published: Monday January 16, 2023

 తల్లాడ, జనవరి 14 (ప్రజాపాలన న్యూస్): తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారని తల్లాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఈ సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ ఈ ఏడాదంతా ప్రజలందరికీ మేలులు జరగాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తల్లాడ ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.