సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ** టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిరా

Published: Tuesday August 02, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు01 (ప్రజాపాలన, ప్రతినిధి) : సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం  నిర్లక్ష్యం చేస్తుందని, అసమర్థ పాలనకు చరమగీతం పాడాలని, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల్కర్ సాయిరాం పేర్కొన్నారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ చేపట్టిన "సంక్షేమ హాస్టల్ బాట"లో భాగంగా జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో హట్టిలో గల "గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్"ను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోల్కర్ సాయిరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని,  కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, అదేవిధంగా త్రిబుల్ ఐటీ బాసర విద్యార్థి సంజయ్ కలుషిత ఆహారం తిని మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సంక్షేమ భవన్ ను టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మహేష్, పృథ్వి, పరమేష్,వేణు, నవీన్,తదితరులు పాల్గొన్నారు.