ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి *వైష్ణవి గార్డెన్స్ లో నియోజకవర్గ జర్నలిస్

Published: Saturday December 10, 2022

ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో నియోజకవర్గ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టి యు డబ్ల్యూ జే వన్ ఫోర్ త్రీ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి రమేష్,  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సభాధ్యక్షుడు నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ  ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి చెరుకూరు మహేందర్, జనరల్ సెక్రెటరీలు హరికృష్ణా రెడ్డి  తదితర జర్నలిస్టులు కార్యక్రమానికి హాజరయ్యారు.  ముందుగా కార్యక్రమంలో సభ్యత్వ నమోదు జరిగింది. మొట్టమొదటగా సీనియర్ పాత్రికేయుడు బృంగి శశివర్ణం అకాల మరణం పొందినందుకుగాను ఆయనను స్మరిస్తూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా మహాసభలకు బృంగి శశివర్ణం ప్రాంగణం అనే పేరును జర్నలిస్టులు ప్రతిపాదించగా జిల్లా నాయకులు ఆమోదించడం జరిగింది. అనంతరం సీనియర్ జర్నలిస్టు పిడికిలి చానల్ సీఈవో రామకృష్ణ కు సంఘ సభ్యత్వం  అధ్యక్షుడు శేఖర్ సాగర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకాల విషయంలో సుదీర్ఘంగా మాట్లాడారు. సంఘం తరఫున నియోజకవర్గం పరిధిలోని కరోనా సోకిన ప్రతి జర్నలిస్టుకు   నిత్యవసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందించి చాలా రకాలుగా ఉపయోగపడ్డామని ఈ సందర్భంగా  ఆయన తెలియజేశారు. క్రిస్టియన్స్ సంస్థ ద్వారా కోశాధికారి చెరుకూరి రాజు ఆధ్వర్యంలో కొంతమంది కరోనా సౌకర్యం జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంగం జిల్లా అధ్యక్షుడు అనంతరం శేఖర్ సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇండ్ల సమస్యలు  పరిగణలోకి తీసుకొని జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న  టీయూడబ్ల్యూజే 143 సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు, జాయింట్ సెక్రెటరీలు హరి కృష్ణారెడ్డి, చెరుకూరి మహేందర్, నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చెరుకూరి మహేందర్, నియోజకవర్గ ముఖ్య సలహాదారు చండీశ్వర్,అశోక్,  జర్నలిస్ట్ నాయకులు కృష్ణ, పసునూరు వెంకటేష్ , చెరుకూరి మల్లేష్, అంజి,  ఆంజనేయులు, రాఘవేందర్, సుదర్శన్, సురమోని బాబు, దశరథ్, సురేందర్, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.