తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యురాలు గా నీలం పద్మ వెంకటస్వామ

Published: Saturday January 29, 2022
హైదరాబాద్ 27 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: డిజిటల్ సభ్యత్వ నమోదు లో భాగంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. మొదటి నుండి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆలేరు ప్రాంత నివాసితులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న నాయకురాలు శ్రీమతి నీలం పద్మ వెంకటస్వామి ని ప్రతిపాదించారు. హాజరైన నాయకుల ఆమోదం మేరకు డిజిటల్ సభ్యత్వ నమోదు కమిటీ సభ్యులుగా యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారని తెలిపారు. ఈ సంధర్బంగా నూతన బాధ్యతలు చేపట్టిన  నీలం పద్మ  మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నీలం పద్మ వెంకట్ స్వామి  తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో ఆర్డినేటర్ మరియు యాదాద్రి - భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మను తెలంగాణ రాష్ట్రం లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం పార్టీ అధినాయకులు నాపైన నమ్మకంతో పెట్టిన బాధ్యతలను తు.చ. తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 
1. పెద్ద పల్లి అసెంబ్లీ నియోజకవర్గం.
2. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం.
3. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం.
4. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం.
5. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం.
6. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం.
ఈ విధంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సంబంధిత నియోజకవర్గ స్థానిక  నాయకుల కార్యకర్తల సహాయ సహకారాలతో అధిక సంఖ్యలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాలను చేపడుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా పైన ఎంతో నమ్మకంతో ఇన్ని బాధ్యతలు అప్పగించినందుకు ఎక్కువ శ్రద్ధ తో పార్టీ అభివృద్ధికి పాటు పడుతానని చెప్పారు.  తన నియామకానికి సహకరించిన  రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి,  పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావుకు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి, డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా నా నియామకానికి సహకరించిన పెద్దలందరికి  పేరు పేరునా  ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో జరిపించాలని కోరారు. అందరి నాయకుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్  డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఆలేరు నివాసి ప్రజలతో మమేకమైన  నీలం పద్మ వెంకటస్వామి ఎన్నిక పట్ల వివిధ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కొందరు చరవాణి ద్వారా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో పనిచేస్తారని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవే అని పలువురు అభిప్రాయపడ్డారు.