మూడో రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు

Published: Friday February 26, 2021

అశ్వరావుపేట ప్రజా పాలన; అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం పిహెచ్సి ఆసుపత్రి ముందు అంగన్వాడి పదం నాగమణి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోలేటి పకీరయ్య మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం ఆలోచించి ఆ  కుటుంబాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో నిరసనను అనేక రూపాలలో తెలియజేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు. తప్పుడు సమాచారం అందిస్తూ గిరిజన కుటుంబాన్ని అబాసుపాలు చేసిన వైద్యులు రాంబాబు ని తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కుటుంబాన్ని ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఆదుకో లేనిపక్షంలో జిల్లా ఆస్పత్రి ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న ట్లు వారన్నారు. అన్ని సంఘాలను ఏకం చేసి రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో తగరం రాంబాబు  దళిత సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, బొంతు రవి తేజ గారు ఏజెన్సీ దళిత హక్కుల సాధన సమితి మద్దతు తెలిపారు అలాగే ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కోలేటి పకీరయ్య గారు మరియు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.