1.20 కోట్ల నిధులతో మన ఊరు మన బడి అభివృద్ధి

Published: Tuesday February 14, 2023
* పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : 1.20 కోట్ల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నామని పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి అన్నారు. సోమవారం గ్రామ సర్పంచ్ ప్రజా పాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు 4.30 లక్షలు, ఉర్దూ మీడియంకు 2.40 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 42 లక్షలు, 32 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగా కిచెన్ షెడ్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, మరమ్మతులు,  సంపు నిర్మాణం, డైనింగ్ హాల్, పాఠశాల భవనంపై ప్రహరీ గోడ నిర్మాణం వంటి పనులను చేపడుతున్నామని తెలిపారు. అంగన్వాడి భవనాన్ని 9 లక్షలతో నిర్మించామని స్పష్టం చేశారు.