అరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి మేఘశ్రీ హాస్పిటల్ జనరల్ వైద్యులు టి పవనకుమార్ కలకోటలోఉచిత వై

Published: Friday February 03, 2023

బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజా పాలన ప్రతినిధి: ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి ముందుగా వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ వైద్యులు టి పవన్ కుమార్ మండల ప్రజలకు సూచించారు. మండలంలోని కలకోట గ్రామంలో ఉచిత మెగా హెల్త్ చెక్ క్యాంపును బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్థం మేఘ శ్రీ హాస్పిటల్స్, ఎన్ఎస్ రావు మల్టి స్పెషాలిటీ దంత వైద్యశాల ఖమ్మం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ క్యాంపులో 120 మంది పేషంట్లకు ఉచితంగా రక్తపరీక్షలు, ఈసిజి పరీక్షలు దంత పరీక్షలు నిర్వహించి, ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్ చేతులు మీదుగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపులో ప్రముఖ దంత వైద్య నిపుణులు జంగా నిఖిల్ కుమార్, కాన్సర్ వైద్య నిపుణులు నల్లమల శిల్ప, డాక్టర్ బి వెంకట్ లు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జనరల్ వైద్య నిపుణులు టి పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రజలు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సి వస్తుందన్నారు. మంచి ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామంతో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ముందస్తు వైద్యపరీక్ష లతో బిపి, షుగర్, గుండె, నరాలు సంబంధిత రుగ్మతల నుండి బయటపడి ఆరోగ్యకరంగా జీవించవచ్చని పేర్కొన్నారు. బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించే మెగా హెల్త్ క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని కోరారు. దంత, కాన్సర్ వైద్య నిపుణులు జంగా నిఖిల్ కుమార్, నల్లమల్ల శిల్ప లు మాట్లాడుతూ.. విరిగిపోయిన దంతాల వల్ల నోటిలో,అల్సర్స్ ఎర్పిడి, అవి త్వరగా మానకపోతే ఆ అల్సర్సు క్యాన్సర్లుగా మారవచ్చన్నారు. గత పదేళ్ల కాలంలో దాదాపు 34 శాతం వరకు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగాయని, ప్రజల దంత సమస్యలపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. నోటి క్యాన్సర్ గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల చికిత్సలో జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యంగల దయామణి, క్యాంపు నిర్వాహాకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, కుప్పల నిఖిల్, యంగల గిరి, పండగ గోపి, ఇవాంజిలిన్, యంగల రాములు, కిరణ్, ఉజ్వల్ చరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.