ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 30 ప్రజా పాలన ప్రతినిధి, *రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర

Published: Thursday December 01, 2022

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..సాగర్ రహదారిపై నిరసన తెలియజేయడం జరిగింది..*కాంగ్రెస్ పార్టీ  ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో*  జరిగిన ఈ కార్యక్రమానికి కార్యక్రమంకి ఇంచార్జ్ *మరికంటి భవాని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్నాథ్ రెడ్డి.. ఈసీ శేఖర్ గౌడ్*.. తోపాటు మండల,మున్సిపల్ అధ్యక్షులు..నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు..ఎన్ ఎస్ యు ఐ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కావడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల పాలిట ధరణి పోర్టల్ పెద్ద శాపంగా మారిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్  తీసుకున్నా అనాలోచిత నిర్ణయాల  వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు..ప్రభుత్వం తక్షణమే ధరణి వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని, ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..కౌలు రైతులకు  ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని..పట్టాలు పట్టాలు అందించాలని తెలియజేశారు..రైతు రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెబుతామని అన్నారు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మైనింగ్ జోన్లను ఎత్తివేయాలని.. మైనింగ్ భూ భాదిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా తెరాస భాజాప ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు..డిసెంబర్ 5వ తేదీన  వేలాది మంది రైతుల చే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ పార్టీ  జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్.. యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి..వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి..వివిధ మండల,మున్సిపల్ అధ్యక్షులు..జడల రవీందర్ రెడ్డి..కొత్త ప్రభాకర్ గౌడ్..మస్కు నరసింహ..వింజమూరి రాంరెడ్డి.. కొత్తపల్లి జైపాల్ రెడ్డి..కొత్తకురుమ మంగమ్మ శివకుమార్  తో పాటు స్థానిక కౌన్సిలర్స్  ఆకుల మమత ఆనంద్..మోహన్ నాయక్..తోపాటు వివిధ మున్సిపాలిటీ ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. సర్పంచులు..తోపాటు స్థానిక నాయకులు కొత్త ప్రవీణ్ గౌడ్.. కొండ్రు ప్రవీణ్..ప్రేమాకర్ రెడ్డి.. పాండురంగారెడ్డి.సొప్పరి రవికుమార్...మంకాల కరుణాకర్.. శ్రీకాంత్..రామకృష్ణ యాదవ్..నందకిషోర్..రాజశేఖర్ రెడ్డి. శ్రీధర్ గౌడ్.. సాయి..ముత్యాల శ్రీహరి...సోహెల్..గోపాల్ తోపాటు వందలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు,