రైతు వేదిక, నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్మన్ దావావసంత

Published: Friday July 30, 2021
జగిత్యాల, జులై 29 (ప్రజాపాలన ప్రతినిధి) : రురల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించి జిల్లా రూరల్ మండల నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్  పంపిణీ చేసినారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రైతు భీమా చెక్కు అందజేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 13 రైతు వేదికలను ప్రారంభించుకున్నామని అన్నారు. ఎంపీపీ గంగారాం గౌడ్ మరణం పార్టీకి తీరని లోటని గుర్తు చేశారు. రైతులకోసం 24 గంటల కరెంట్, రైతు భీమా, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి సాగు నీరు, వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కృషి వల్లనేనని అన్నారు. పంటలకు త్వరలోనే 90 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. ఈ వేధికలలో రైతుల కోసం ఎమ్మెల్యే నిధుల నుండి 13 క్లస్టర్ లలో ప్రోజక్టర్ ఏర్పాటు కు నిధులు కేటాయిస్తానని అన్నారు. అలాగే జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమమని రైతులు అభివృద్ధి చెందటానికి, అధికారులు రైతు వేదికలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు, మండల రైతు బంధు కన్వీనర్ రవిందర్ రెడ్డి, పిఏ సిఎస్ చైర్మన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జిల్లా రైతు బంధు సభ్యుడు బాల ముకుందాం, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ లు ఎల్లా గంగానర్సు రాజన్న, బోనగిరినారాయణ, సత్తమ్మ గంగారాం, రాజమని గంగాధర్, ఎంపీటీసీ భుపెళ్లి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, ఎమ్మార్వో దిలీప్, ఎంపీడీఓ రాజేశ్వరి, ఏవో తిరుపతి, రైతు బంధు సమితి నాయకులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.