రామ‌లింగ‌న్న ఆశ‌యం కోసం ప‌ని చేద్దాం

Published: Thursday October 29, 2020

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : రామ‌లింగ‌న్న ఆశ‌యం కోసం ప‌ని చేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపు ఇచ్చారు. బుధవారం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతతో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దుబ్బాక ఉపఎన్నికల ప్రచార సభలో రోడ్ షోలో పాల్గొన్నారు. దివంగ‌త టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఆశ‌యం కోసం ప‌ని చేద్దామ‌ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నికలో దివంగత సోలిపేటరామలింగారెడ్డి స్థానంలో ఆయన సతీమణి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల కోసం ఎంతో కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు చేసిందేమీ లేద‌న్నారు. రైతుల క‌ష్టాల‌ను చూసిన కేసీఆర్ వారిని రాజుల‌ను చేయాల‌ని చేస్తుంటే, బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకెళ్తుంద‌న్నారు. బావుల వ‌ద్ద మీట‌ర్లు బిగించే బీజేపీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో పాటు వికారాబాద్ నియోజకవర్గం నుండి పార్టీ ప్రెసిడెంట్లు నారెగూడెం కమాల్ రెడ్డి, నాసన్ పల్లి నర్సింహరెడ్డి, నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అనిల్, శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్లు మల్లేశం, రాములు, విజయ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్లు సత్యనారాయణ రెడ్డి, ముత్యంరెడ్డి, రాంచెంద్రారెడ్డి, పిఏసిఎస్ వైస్ చైర్మన్లు సుధాకర్ గౌడ్, పాండు, రాజు నాయక్, వైస్ ఎంపీపీ విజయ్, ఏఎంసి వైస్ ఛైర్మన్లు రాజు గుప్త, లక్ష్మయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు వెంకటయ్య, నాయబ్ గౌడ్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, నవీన్, అర్.నర్సింలు, చందర్ నాయక్, సర్పంచులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేష్, హరీష్ శంకర్, జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శేఖర్ నూరుద్దీన్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు చిగుళ్ళపల్లి రమేష్, వెంకటేష్, ముత్తాహార్ షరీఫ్, రాంరెడ్డి, భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, సత్తయ్య, సాయి, శరణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, మధు, అశోక్, రమణ, అంజయ్య గౌడ్, కావలి అంజయ్య, శివకుమార్, సంతోష్, కలీమ్ షేక్, తాజుద్దీన్, షఫీ, వికాస్, ప్రవీణ్, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.