టివివిపి జిడిఎ జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తుప్ప ఆనందం ఎన్నిక

Published: Wednesday May 18, 2022
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజాపాలన : తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తుప్ప ఆనందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుటకు అహర్నిశలు కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంఘంలోని ప్రతి సభ్యునికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వానికి సంఘానికి మధ్య వారధిగా నిలుస్తానని హామీ ఇచ్చారు సంఘం ప్రధాన కార్యదర్శి గా నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ వైద్యుల సంఘం ( టివివిపి జిడిఎ ) గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ డి రవిశంకర్, అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ తుప్ప ఆనంద్ ఆనందం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ చరణ్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ శాంతప్ప, కోశాధికారిగా డాక్టర్ శరత్ సీఈసీ గా డాక్టర్ స్నేహలత సభ్యులుగా డాక్టర్ శ్రీధర్ గౌడ్ డాక్టర్ కళ్యాణి డాక్టర్ ప్రవీణ్ గౌడ్ ఈసీ సభ్యులుగా డాక్టర్ సాజియా డాక్టర్ మారుతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.