నాసా పరీక్షలో గ్లోబల్ మొదటి ర్యాంక్ సాధించిన బ్రిలియంట్ విద్యార్ధి శ్రీహన్ రెడ్డి

Published: Tuesday February 21, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఎడ్మల శ్రీహన్ రెడ్డి మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల లక్ష్మీ- సునీల్ కుమార్ దంపతుల కుమారుడు   నాసా ( నేషనల్ ఎరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ) పరీక్షలో రాష్ట్ర మరియు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెయిటెస్ట్ మైండ్స్ ఆఫ్ వరల్డ్ ఐదో స్థాయి పరీక్షలో గ్లోబల్ మొదటి ర్యాంక్ సాధించి అమెరికాలోని నాసా కేంద్రాన్ని సందర్శించేందుకు అర్హత పొందాడు.బ్రిలియంట్ పాఠశాల చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు, మంచి విద్యకు మారుపేరు బ్రిలియంట్ విద్యా సంస్థలని విద్యార్ధి శ్రీహన్ రెడ్డికి నాసా ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీహన్ రెడ్డి జీవితంలో ఇంకా ఎంతో విజయాలు సాధించాలని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకెళ్ళ ఇందిరా, డైరెక్టర్ జె. వి. డి ప్రసాద్ రావు, ప్రిన్సిపాల్ ప్రశాంత్ లు విద్యార్ధి శ్రీహన్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమం లో చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి,  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకెళ్ళ ఇందిరా డైరెక్టర్ జె.వి.డి ప్రసాద్ రావు,ప్రిన్సిపాల్ ప్రశాంత్,పాఠశాల సిబ్బంది  విజయ,తిరుపతి,సంజీవ్,స్వర్ణ, అమ్రీన్, నవీన్,రమేష్,ప్రవీణ్, అంబరీష్ మరియు విద్యార్ధి తల్లితండ్రులు లక్ష్మి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.