కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి

Published: Wednesday May 19, 2021
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ 24గంటల రిలే దీక్ష
జగిత్యాల మే 17 (ప్రజాపాలన ప్రతినిధి) జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన ముసిపట్ల లక్ష్మీ నారాయణ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజాల రమేష్  24గంటల దీక్ష చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలంటే కరోనా ను తక్షణమే ఆరోగ్య శ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కరోనా ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవని మండిపడ్డారు. అలాగే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించడంలో ఆక్సిజన్ కూడా విఫలమైందని ఆరోపించారు. పైవేట్ హాస్పిటల్ యాజమాన్యం విచ్చలవిడిగా బిల్లులు 10లక్షల నుండి 20లక్షల వరకు అక్రమవసూళ్లకు పాల్పదుతున్నారని ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఆరోగ్య శ్రీ అందించకుండా వందల మంది చావుకు కెసిఆర్ కరణమవుతున్నారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.