పాలియేటివ్ క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంబించిన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్

Published: Wednesday November 09, 2022
జగిత్యాల, నవంబర్, 08 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా జనరల్ ఆసుపత్రి పాత బస్టాండ్ లో పాలియేటివ్ క్రిటికల్ కేర్ యూనిట్ ను  ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంబించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స చేయవచ్చు అని అన్నారు. ప్రజలు నిరంతరం ఆరోగ్యం విషయం లో అప్రమత్తం గా ఉండి జాగ్రతలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ సొక కుండా చేసే అవకాశం ఉందన్నారు. ఆలన కార్యక్రమం ద్వారా మంచానికే పరిమిత మైన రోగులకు వాహనం తో  ఇంటివద్ద కే  వైద్య సేవలు అందించే సదుపాయం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ  శ్రీదర్, సుపరిందెంట్ రాములు, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, అర్ ఎం ఓ శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు  గట్టు సతీష్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు మొగిలి, భోగ ప్రవీణ్,
కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, క్యాడాసు నవీన్, అల్లే గంగా సాగర్ బొడ్లా జగదీష్, కోరే గంగమల్లు, ముస్కు నారాయణ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు అరిఫ్, నాయకులు పిరోజ్, లవంగ రాజేందర్, దాసరి ప్రవీణ్, అడువాల లక్ష్మణ్, బాలుసాని శ్రీనివాస్, గంగాధర్, మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.